తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అమాయక మహిళలను నమ్మించి డబ్బులు కాజేసి.. తిరిగి ఇవ్వమని అడిగిన పాపానికి ఆమెపై బెదిరింపులకు దిగుతున్నాడు. కిరణ్ రాయల్ వేధింపులపై బాధిత మహిళ విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కిరణ్ రాయల్‌ను నమ్మి మోసపోయానని, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది.
”నా పేరు లక్ష్మి, లైఫ్‌లో ఒకరిని నమ్మి చాలా మోసపోయాను. రూ.1.20 కోట్లు అప్పులు చేసి ఇచ్చాను. అతను నా పిల్లలను చంపుతానని బెదిరించి, భయపెట్టి కేవలం రూ.30 లక్షలకు బాండ్ పేపర్లు రాయించుకున్నాడు. నా దగ్గర ఇలాగే బెదిరించి వీడియో రికార్డు తీసుకున్నాడు. అన్ని ప్రూఫ్ నా దగ్గర ఉన్నాయి. ఇక నేను బతకలేను. అప్పులు ఎక్కువయ్యాయి, పిల్లలకు సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను కిరణ్ రాయల్.. తిరుపతి జనసేన ఇన్‌చార్జ్ నేను చనిపోయిన తరువాత అయినా ఆ డబ్బులు నా పిల్లలకు చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే చనిపోతున్నాను” అని మహిళ సెల్ఫీ వీడియో ద్వారా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
— Kiran royal (@KiranRoyaljsp) February 8, 2025
కూటమి అధికారంలోకి వచ్చాక తిరుపతిలో కిరణ్ అరాచకాలు విపరీతం అయ్యాయని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో ఆయన అండతో కిరణ్ రెచ్చిపోతున్నాడని, అయినా ఎవరు పట్టించుకోవడం లేదని తిరుపతి వాసులు ఆరోపణలు చేస్తున్నారు. మరి జనసేన అధినేత, డిప్యూటీ సీఎం కిరణ్ రాయల్ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.