---Advertisement---

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు
---Advertisement---

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై నిబంధనలు కట్టుదిట్టం చేయాల‌ని ప్ర‌భుత్వం పోలీస్ శాఖ‌ను ఆదేశించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. అదే విధంగా మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్‌లు అంద‌జేయ‌నున్నారు.

భద్రతా కారణాల రీత్యా పాస్‌లు ఉన్నవారికే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతివ్వ‌నున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్‌ల జారీ చేస్తున్నారు. అసెంబ్లీ ఒకటో గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లకు అనుమతి ఇస్తారు. అదే విధంగా సీఎం, డిప్యూటీ సీఎంలను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్నారు. అసెంబ్లీ గేట్ 2 నుంచి మంత్రులకు, అసెంబ్లీ గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మాత్రమే అనుమతించ‌నున్నారు.

శాస‌న మండలి ఛైర్మన్, స్పీకర్, సీఎం వచ్చి వెళ్లే కారిడార్ లో ఇతరులకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. నాలుగో గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదని వెల్లడించారు. మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతిస్తార‌ని, శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ సిబ్బందికి అనుమతి లేదని స్పష్టం చేశారు. శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదని సూచించారు. ఒకవేళ వచ్చినా ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్ లో డిపాజిట్ చేయాలని కోరారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment