ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మరో దారుణ సంఘటన వెలుగు చూసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr.B. R. Ambedkar) కోనసీమ జిల్లా (Konaseema District) రాయవరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో (Private School) పాఠశాల ప్రిన్సిపల్ (Principal) కీచకపర్వం బయటపడింది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రిన్సిపల్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టిన దుర్మార్గపు ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. రాయవరం మండలం మాచవరం (Machavaram)లో ఓ ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదోతరగతి విద్యార్థినిపై ప్రిన్సిపల్ జయరాజు (Jayaraju) అత్యాచారానికి (Sexual Assault) పాల్పడ్డాడు. నాలుగు నెలల క్రితం బాలికపై జయరాజు లైంగిక దాడి చేశాడు. అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెప్పితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక భయంతో ఎవరితోనూ మాట్లాడడం లేదు. అదే అవకాశంగా భావించిన ప్రిన్సిపల్, ఆమెను అనేకసార్లు లైంగిక దాడికి గురి చేశాడు.
కాలక్రమేణా బాలికకు పిరియడ్స్ రాకపోవడంతో తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసి వైద్య పరీక్షలు చేయించగా ఆమె గర్భవతిగా ఉన్నట్లు వెల్లడైంది. ఈ భయంకర నిజం బయటపడిన తర్వాత వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.








