నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna)ను స్ఫూర్తిగా తీసుకుని పలువురు కన్నడ భామలు (Kannada Actresses) దక్షిణాది చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఆషికా రంగనాథ్, రుక్మిణీ వసంత్, శ్రీనిధి శెట్టి, శ్రద్ధా శ్రీనాథ్ వంటి తారల జాబితాలోకి తాజాగా ‘కాంతార’ (‘Kantara’) ఫేమ్ (Fame) సప్తమి గౌడ (Saptami Gowda) చేరింది. అయితే, ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఆశించిన స్థాయిలో లేదని తెలుస్తోంది.
‘కాంతార’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న సప్తమి గౌడ, ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తుండటంతో సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. బాలీవుడ్‌లో ‘ది వాక్సిన్ వార్’ (The Vaccine War)తో అడుగుపెట్టి అక్కడ విజయం అందుకుంది.
టాలీవుడ్‌లో నితిన్ ‘తమ్ముడు’ (‘Tammudu’) సినిమాపై సప్తమి గౌడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇందులో ఆమెది చిన్న పాత్ర అయినప్పటికీ, ప్రముఖ నిర్మాణ సంస్థ దిల్ రాజు (Dil Raju) బ్యానర్ (Banner) కావడంతో ఆ ఆఫర్‌ను కాదనలేకపోయింది. అయితే, భారీ అంచనాల మధ్య విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ రావడమే కాకుండా, సప్తమి గౌడ పాత్ర సైతం ప్రేక్షకులను “చిరాకు పెట్టింది” అనే విమర్శలు వచ్చాయి.
సినిమా పరాజయం పాలవడం, తన పాత్రకు నెగిటివ్ రెస్పాన్స్ (Negative Response) రావడంతో తెలుగులో స్టార్ హీరోయిన్ కావాలనుకున్న ఈ కన్నడ భామకు పెద్ద షాక్ తగిలింది. ప్రస్తుతం సప్తమి తమిళం, కన్నడ భాషలతో పాటు హిందీలో ‘థామా’ చిత్రంలో కనిపించనుంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సప్తమి కీలక పాత్ర పోషిస్తోంది. మరి, తెలుగులో రాణించాలని కలలు కన్న సప్తమికి తదుపరి అవకాశం ఎప్పుడు వస్తుంది, హిట్ ఎప్పుడు వరిస్తుంది అనేది చూడాలి.