ఆంధ్రాలో సంక్రాంతి పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భోగి మంటలు, కోళ్ల పందేలు ఆ సందడే వేరు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నివసించేవారంతా కుటుంబ సమేతంగా తమ సొంత ఊర్లకు తిరుగు పయనం అవుతారు. ఇక విద్యార్థులు సంక్రాంతి సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరి గంతేస్తారు. కాగా, సంక్రాంతి సెలవులపై గత కొన్ని రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది.
సంక్రాంతి సెలవులపై క్లారిటీ
2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ఏపీలో సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. 11-15 లేదా 12-16 తేదీల్లో సెలవులు ఉంటాయన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ప్రజలు తమ పండుగ ప్రయాణాలు సులభంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
విద్యా సంవత్సరానికి మరిన్ని సెలవులు
2025కి సంబంధించిన సెలవుల జాబితాను కూడా ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. మొత్తం 23 సాధారణ సెలవులు, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయని ప్రకటించింది. అయితే, వీటిలో నాలుగు సెలవులు ఆదివారం రాకతో విద్యార్థులు కొంత నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది.