మేడే.. ఏ ప‌నీ చిన్న‌దేం కాదు.. – సంపూర్ణేష్ బాబు

మేడే.. ఏ ప‌నీ చిన్న‌దేం కాదు.. - సంపూర్ణేష్ బాబు

మే డే (May Day) సందర్భంగా సినీ నటుడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పంచుకున్నారు. “ప్రతి వృత్తిలోనూ గౌరవం ఉంది. ఏ పని చిన్నదేం కాదు (No job is small). కష్టపడి పనిచేస్తున్న వాళ్ల‌కే అసలైన గౌరవం దక్కాలి” అంటూ ట్వీట్ చేశారు. కష్టజీవులందరికీ తన వందనాలు తెలుపుతూ, కార్మిక లోకానికి మే డే శుభాకాంక్షలు (May Day Greetings) తెలిపారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ వీడియోను కూడా విడుదల చేసిన సంపూర్ణేష్ బాబు, ప్రతి ఉద్యోగికి, కార్మికుడికి తన అభినంద‌న‌లు, మేడే శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయన సందేశం మానవీయతతో పాటు, కార్మికుల కృషికి గౌరవం అర్పించేలా ఉండటం ప్రశంసనీయమ‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment