సమంత రెండో పెళ్ళికి రెడీ అవుతుందా?

సమంత రెండో పెళ్ళికి రెడీ అవుతుందా?

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) రెండో పెళ్లి (Second Marriage) చేసుకోబోతోందంటూ ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. నాగచైతన్యతో విడాకుల (Divorce) తర్వాత, చాలా కాలంగా సింగిల్‌గా ఉంటూ తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంత.. ఇప్పుడు మళ్ళీ ప్రేమలో పడిందని టాక్.

బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో సమంత సీక్రెట్‌గా డేటింగ్ చేస్తోందన్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల సమంత – రాజ్ (Samantha-Raj) కలిసి ఉన్న కొన్ని వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఒక ఫోటోలో రాజ్, సమంత భుజంపై చేయి వేసి, ఇద్దరూ ఆప్యాయంగా నవ్వుకుంటూ ఉండటాన్ని చూసిన నెటిజన్లు.. ఇది కేవలం స్నేహం కాదని భావిస్తున్నారు.

అక్టోబర్ 6నే రెండో పెళ్లి?
సమాచారం ప్రకారం, సమంత రెండో పెళ్లికి తేదీ కూడా ఖరారు చేశారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మొదట ఆగస్టులో పెళ్లి అనుకున్నప్పటికీ, సమంత అక్టోబర్ 6న తన రెండో పెళ్లిని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ తేదీని చూసి చాలామంది షాక్ అయ్యారు. ఎందుకంటే సమంత – నాగచైతన్యల పెళ్లి కూడా అక్టోబర్ 6నే జరిగింది. అయితే, ఈసారి పెళ్లి ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా ఒక చర్చిలో, ఇరువురి సన్నిహితుల సమక్షంలో మాత్రమే జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
కానీ దీనిపై సమంత గానీ, రాజ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ ఈ వార్త వేగంగా వైరల్ అవుతోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే.. సామ్ చాలా జాగ్రత్తగా తన ప్రాజెక్టులను ఎంచుకుంటోంది. అన్నీ కలిపి చూస్తే, సమంత జీవితం మరో కొత్త దశలోకి అడుగు పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈసారి ప్రేమ, పెళ్లి, కెరీర్ అన్నీ తన నియంత్రణలోనే ఉండేలా చూసుకుంటుందనిపిస్తోంది. మరి అక్టోబర్‌లో ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా? లేక ఇది కూడా ఓ పుకారేనా? అనేది త్వరలోనే తేలనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment