బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం ‘సికిందర్’ టీజర్ తాజాగా విడుదలైంది. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సాజిద్ నడియాడ్వాలా నిర్మించారు. టీజర్‌లో సల్మాన్ పాత్రను శక్తివంతంగా పరిచయం చేస్తూ, అందరినీ ఆకట్టుకునేలా మేకర్స్ రూపొందించారు. పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
రష్మికతో సల్మాన్ కెమిస్ట్రీ తెరపై ఎంత మేరకు మెప్పించనుందో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం రంజాన్ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. సల్మాన్ అభిమానులు ఇప్పటికే భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమాపై హిట్ ముద్ర వేస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సికిందర్ టీజర్ నిన్ననే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా టీజర్ విడుదలను వాయిదా వేశారు. నేడు ఆయన అంత్యక్రియలు పూర్తయిన తరువాత విడుదల చేశారు.








