సాయి తేజ్ పూర్వ వైభవం.. ఆశగా ఫ్యాన్స్!

సాయి తేజ్ పూర్వ వైభవం.. ఆశగా ఫ్యాన్స్!

Summarize with AI

ఒకానొక సమయంలో మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న మెగా హీరో సాయి దుర్గ తేజ్ (Sai Durga Tej) , బైక్ ప్రమాదం తర్వాత కెరీర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాదం నుంచి కోలుకున్నాక చేసిన సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడం, లుక్స్, డైలాగ్ డెలివరీపై విమర్శలు రావడంతో ఆయన కెరీర్‌ కాస్త డీలా పడింది.

అయితే, సాయి తేజ్ తన తదుపరి చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yetigattu)పై భారీ ఆశలు పెట్టుకున్నారు. అన్ని అడ్డంకుల్ని దాటుకొని ఈ పీరియాడిక్ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

గ్లింప్స్ అదరగొట్టింది:

తాజాగా విడుదలైన ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్‌లో సాయి తేజ్ కొత్త లుక్‌తో, సిక్స్ ప్యాక్ ఫిజిక్తో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన లుక్స్ అద్భుతంగా ఉండటమే కాక, డైలాగ్ డెలివరీలోనూ స్పష్టతతో “వావ్” అనిపించారు.

ఈ తాజా టీజర్ చూసిన తర్వాత, సాయి తేజ్ అన్ని ఇబ్బందులను దాటుకొని బౌన్స్ బ్యాక్ అయినట్లే అని సినీ వర్గాలు, మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాతో మెగా హీరో మళ్లీ లైన్‌లో పడి తన పూర్వ వైభవాన్ని అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment