సాయిపల్లవికి ఆరోగ్య సమస్య.. బెడ్‌ రెస్ట్ అవసరం!

సాయిపల్లవికి ఆరోగ్య సమస్య.. బెడ్‌ రెస్ట్ అవసరం!

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’ (Thandel Movie). ముంబైల్‌లో నిర్వ‌హించిన‌ ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్‌కు సాయిపల్లవి (Sai Pallavi) హాజ‌రుకాలేదు. దీంతో సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌గా, చిత్ర యూనిట్‌ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. అందుకు కారణం ఏమిటో దర్శకుడు చందూ మొండేటి వివరించారు.

సాయిపల్లవికి విశ్రాంతి అవసరం
సాయిపల్లవి కొద్ది రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. అయినప్పటికీ, ఆమె సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, అధిక శ్రమ వల్ల ఆమె మరింత నీరసించి పోయారు. వైద్యుల సూచన మేరకు కనీసం రెండు రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, ఆమె ట్రైలర్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయారు అని చందూ మొండేటి స్పష్టం చేశారు. ఇదే విష‌యాన్ని తండేల్ సినిమా నిర్మాత అల్లు అర‌వింద్ కూడా ధ్రువీక‌రించారు. ఈ వార్త విన్న అభిమానులు.. సాయిపల్లవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment