రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin), భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ప్రత్యేక ఆహ్వానం పంపారు. మే 9న మాస్కో (Moscow)లో నిర్వహించనున్న విక్టరీ డే పరేడ్ (Victory Day Parade)లో మోడీ పాల్గొననున్నట్టు అధికారికంగా వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై రష్యా సాధించిన విజయానికి స్మారకంగా ప్రతి ఏడాది మే 9న విక్టరీ డే వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఏడాది వేడుకలు ప్రత్యేకంగా 80 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంలో జరగనున్నాయి. ఈ గ్రాండ్ పరేడ్‌లో పాల్గొనాలని మోడీకి పుతిన్ స్వయంగా ఆహ్వానం (Invitation) పంపారు.
మోడీ హాజరుకావటం ఖాయం: రష్యా ప్రకటన
ఈ సందర్భంగా రష్యా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ ఆండ్రీ రుడెంకో (Andrey Rudenko) మాట్లాడుతూ, మోడీ విక్టరీ డే వేడుకల్లో హాజరుకాబోతున్నట్టు ప్రకటించారు. రష్యా సైనిక శక్తిని, చారిత్రక ఘనతను ప్రదర్శించే ఈ కార్యక్రమానికి భారత్‌తో పాటు అనేక మిత్రదేశాల నాయకులను ఆహ్వానించినట్టు తెలిపారు.
గతేడాది జూలైలోనే మోడీ రష్యా పర్యటన
2024 జూలైలో ప్రధాని మోడీ రష్యా పర్యటన నిర్వహించారు. దాదాపు ఐదేళ్ల అనంతరం జరిగిన ఈ పర్యటనలో పుతిన్‌తో కీలక సమావేశాలు, చర్చలు జరిపారు. అదే సమయంలో పుతిన్‌ను భారత్ పర్యటనకు ఆహ్వానించిన మోడీకి, పుతిన్ అంగీకారం తెలిపారు. అయితే పర్యటనకు సంబంధించి తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య