హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఒక భారీ డ్రగ్స్ (Drugs) తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch) అధికారులు గుట్టురట్టు చేశారు. మేడ్చల్ (Medchal) ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీపై దాడులు చేసి, ఏకంగా రూ. 12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఆపరేషన్‌లో, అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌టీసీ (XTC), మోలీ, మరియు ఎండీఎంఏ (MDMA) వంటి డ్రగ్స్‌ను భారీ పరిమాణంలో పోలీసులు గుర్తించారు. అలాగే, సుమారు 32,000 లీటర్ల ముడిసరుకును కూడా సీజ్ చేశారు. ఈ కేసులో డ్రగ్స్ తయారీలో పాలుపంచుకున్న 13 మందిని అరెస్టు(Arrest) చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్ర (Maharashtra) పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ దాడులు నిర్వహించింది. ఈ ఫ్యాక్టరీలో తయారవుతున్న డ్రగ్స్‌ను దేశంలోని వివిధ ప్రాంతాలకు, అలాగే విదేశాలకు కూడా అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.