రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రితిక ఎమోష‌న‌ల్‌

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై రితిక ఎమోష‌న‌ల్‌

టీమిండియా (Team India) ఓపెనర్, ‘హిట్‌మ్యాన్ (Hitman)’ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టు క్రికెట్‌ (Test Cricket)కు గుడ్‌బై (Goodbye) చెప్పారు. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆయన టెస్టులకు రిటైర్మెంట్ (Tests Retirement) ప్రకటించారు. ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రకటన హిట్ మ్యాన్ అభిమానుల్లో భావోద్వేగం రేకెత్తించింది. ఇకపై వన్డేలు, టీ20లపై దృష్టి పెట్టనున్నట్టు భావిస్తున్నారు.

రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌కు ముగింపు పలక‌డంపై అత‌ని భార్య రితిక సజ్దే (Ritika Sajdeh) కూడా తన మనసులోని భావాలను బయటపెట్టింది. రోహిత్ రిటైర్మెంట్ గురించి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పోస్ట్ చేస్తూ ఆమె “పగిలిన గుండె (Broken Heart), సెల్యూట్ (Salute), కన్నీళ్లతో (With Tears)” ఉన్న ఎమోజీలను (Emojis) జత చేసింది. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు, ‘ఫ్యాన్స్ లాగే రితిక కూడా రోహిత్ రిటైర్మెంట్‌ను తట్టుకోలేకపోయింది’ అని కామెంట్ చేస్తున్నారు.

ఇప్పటి వరకూ రోహిత్ శర్మ 67 టెస్టులు ఆడి 4,301 పరుగులు సాధించారు. ఇందులో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 212. టెస్టుల్లో కెరీర్‌ను మెల్లిగా మొదలుపెట్టి, ఆ తర్వాత ఓపెనర్‌గా నిలిచిన రోహిత్, భారత టెస్టు జట్టులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment