ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌కు రోహిత్-కోహ్లీ దూరం!

ఆస్ట్రేలియా-ఎ సిరీస్‌కు రోహిత్-కోహ్లీ దూరం!

క్రికెట్ అభిమానులకు ఇది నిరాశ కలిగించే వార్తే. టీమిండియా (Team India) దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Rohit Sharma)లు ఆస్ట్రేలియా-ఎ  (Australia-A) తో జరగనున్న అనధికారిక సిరీస్‌ (Seriesలో పాల్గొనడం లేదు. ఈ ఇద్దరూ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్న తర్వాత ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.

వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు సన్నాహకంగా వీరు ఆస్ట్రేలియా-ఎతో ఆడతారని వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ(BCCI)లోని ఒక సీనియర్ అధికారి ఈ వార్తలను ఖండించారు. “రోహిత్, కోహ్లీ ఈ సిరీస్‌లో ఆడటం అసాధ్యం. మేము జూనియర్లతో కలిసి ఆడమని వారిని బలవంతం చేయము,” అని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ చాలా ఫిట్‌గా ఉన్నారని, ఆసీస్‌తో ప్రధాన సిరీస్‌కు సిద్ధంగా ఉన్నారని ఆ అధికారి తెలిపారు. ఇటీవల రోహిత్ తన ఫిట్‌నెస్ పరీక్షలో విజయం సాధించగా, కోహ్లీ త్వరలో హాజరు కానున్నారు. అక్టోబర్‌లో ఆసీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment