ఈ నెల 11న న్యూజిలాండ్‌తో మొదలయ్యే మూడు వన్డేలు సిరీస్ కోసం శుక్రవారం టీమిండియా జట్టును సెలక్టర్లు ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఫ్యాన్స్, క్రికెట్ వర్గాల్లో ప్రధాన చర్చ రిషబ్ పంత్ జట్టులో చోటు దక్కుతుందా లేదా అని ఫాన్స్ లో చర్చ జరుగుతుంది. రిషబ్ పంత్ ప్రస్తుతం టెస్టుల్లో మాత్రమే రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వన్డేల్లో అతడికి స్థిర స్థానంలేదు, ముఖ్యంగా ఈ ఫార్మాట్లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా ఉండటం, పంత్ ఫామ్ అంత మెరుగ్గా లేకపోవడం వంటి కారణాల వల్ల అతడి ప్లేస్‌పై అనిశ్చితి నెలకొంది. గత ఏడాది పంత్ వన్డేల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్నప్పటికీ మ్యాచ్ ఆడకపోవడం ఇదే స్పష్టత.
దక్షిణాఫ్రికాపై సిరీస్‌లో కూడా పంత్‌కు అవకాశాలు రావడం లేదు. ఇంతకీ న్యూజిలాండ్ సిరీస్‌లో ధ్రువ్ జురెల్ ఫామ్ బాగున్నందున అతడిని రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయవచ్చని ప్రచారం జరుగుతోంది. మరోవైపు, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ కోలుకొని జట్టులోకి రాబోతున్నారు. స్పిన్ విభాగంలో జడేజా, సుందర్, కుల్‌దీప్ ఉంటే, పేస్ లో బుమ్రా, హార్దిక్ విశ్రాంతి పొందనున్నట్లు సమాచారం. సీనియర్ పేసర్ షమీ ఎంపికపై నిర్ణయం, అలాగే అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణలకీ చోటు ఖాయమవుతుందో లేదో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రిషబ్ పంత్ యొక్క తుది స్థానం ఈ సిరీస్‌లో ప్రధాన హాట్ టాపిక్‌గా మారింది.








