ఆర్జీ కర్ బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్

ఆర్జీ కర్ బాధితురాలి తల్లికి బీజేపీ టికెట్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ (RG Kar Medical College) పీజీ డాక్టర్ (PG Doctor) హత్యాచార ఘటన మరో కీలక మలుపు తీసుకుంది. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై అలుపెరగని పోరాటం చేస్తున్న బాధితురాలి తల్లి (Victim’s Mother) రత్నా దెబనాత్ (Ratna Debnath) ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని పానిహటి నియోజకవర్గం (Panihati Constituency) నుంచి ఆమెను తమ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు భారతీయ జనతా పార్టీ (BJP) ప్రకటించింది.

న్యాయం కోసం పోరాటం నుంచి అసెంబ్లీ బరి దాకా
2024 ఆగస్టు 9న ఆర్జీ కర్ హాస్పిటల్ సెమినార్ హాల్‌లో జరిగిన ఆ ఘోర కలికాలం దేశాన్ని నివ్వెరపరిచింది. విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా డాక్టర్‌పై (Lady Doctor) జరిగిన ఆ అమానుషంపై డాక్టర్లు, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు నెలల తరబడి నిరసనలు చేపట్టారు. తన బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రత్నా దెబనాత్, కేవలం తన కుమార్తె కోసమే కాకుండా, రాష్ట్రంలో మహిళల భద్రత కోసం గళమెత్తారు.

బీజేపీ వ్యూహం
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని పదే పదే విమర్శిస్తున్న బీజేపీ(BJP), ఇప్పుడు నేరుగా బాధితురాలి తల్లినే బరిలోకి దింపడం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వానికి గట్టి సవాల్ విసిరింది. తాను ఎమ్మెల్యేగా గెలవడం కంటే, సమాజంలో మహిళలకు న్యాయం మరియు భద్రత కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని రత్నా దెబనాత్ ప్రకటించారు. బాధితురాలి పట్ల ఉన్న సానుభూతి, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత రత్నా దెబనాత్‌కు కలిసొచ్చే అంశాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

దేశవ్యాప్త చర్చాంశంగా పానిహటి ఎన్నిక
పానిహటి నియోజకవర్గం ఇప్పుడు దేశం చూపును తనవైపు తిప్పుకుంది. ఒక తల్లి తన కుమార్తె మరణానికి కారణమైన వ్యవస్థలోని లోపాలను సరిదిద్దేందుకు రాజకీయాల్లోకి రావడం ఒక ఇన్సిపిరేషనల్ మూమెంట్‌గా సామాజిక కార్యకర్తలు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఆర్జీ కర్ అంశంపై మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ ఎన్నికల ఫలితం బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment