తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధికార ప్రతినిధి తీవ్ర విమర్శలు చేశారు. కుట్రపూరితంగానే అల్లు అర్జున్‌పై రేవంత్‌రెడ్డి సర్కార్ దాడిచేస్తోందని, రాజ్య హింసను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ నేత ప్రదీప్ భండారి ఆరోపించారు. అదేవిధంగా అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్లదాడిని కూడా తీవ్రంగా ఖండించారు.
మానవ హక్కుల ఉల్లంఘన
అల్లు అర్జున్ గురించి బీజేపీ నేత ప్రదీప్ భండారి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ప్రేమించే, భావవ్యక్తీకరణ స్వేచ్ఛను విశ్వసించే న్యూట్రల్ స్టార్ అల్లు అర్జున్‌ను రేవంత్ ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన ఎమర్జెన్సీ తరహా పాలనను ప్రతిబింబిస్తుంది. రేవంత్ సర్కార్ చర్యను చూసి హిట్లర్ కూడా సిగ్గుపడతాడు అని అన్నారు. అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి చూపిస్తున్న వివక్ష, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కూడా అడ్డంకి అవుతోందన్నారు.








