తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) “యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police School)”ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “ప్రతి ఒక్కరికీ ఒక్కో బ్రాండ్ ఉంటుంది.. నా బ్రాండ్ (Brand) మాత్రం ‘యంగ్ ఇండియా (Young India)” అంటూ సీఎం రేవంత్ తన అభిప్రాయాలను ప్రకటించారు. “కొంతమంది నాయకుల నిర్ణయాలే చరిత్రను మలుస్తాయి. కొందరికి నచ్చకపోవచ్చు కానీ, పీవీ నరసింహారావు (PV Narasimha Rao) సంస్కరణలు ఈ దేశానికి మార్గదర్శకంగా నిలిచాయి. మేము విధివిధానాలు సృష్టిస్తాం.. వాటిని అమలు చేయాల్సింది మీరు” అని అధికారులను ఉద్దేశించి ఆయన అన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీల దిశగా అడుగులు
రేవంత్ రెడ్డి మరో ముఖ్య ప్రకటన చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా, ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ స్థాయి నుంచే విద్య ప్రారంభం కావాలన్నారు. “ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (Young India Integrated Schools) ఏర్పాటు చేస్తాం. ప్లే స్కూల్స్ (Play Schools) కూడా ప్రారంభిస్తాం” అన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వసతుల అభివృద్ధిపై దృష్టి పెడతామని, సైనిక్ స్కూల్స్ స్థాయిలో పోటీ చేయాలన్నదే లక్ష్యమని స్పష్టం చేశారు.
“మీ బ్రాండ్ మీరు సృష్టించుకోండి… ప్రభుత్వం మీ వెంట ఉంటుంది. నా బ్రాండ్ (Brand) మాత్రం విద్య, ఉద్యోగం, ఉపాధి. ఐటీ కంపెనీలతో భాగస్వామ్యంతో రూ.100 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ‘యంగ్ ఇండియా’ అనే టైటిల్ గాంధీగారి (Gandhiji’s) స్పూర్తిలో పెట్టినది. అదే మా ప్రేరణ” అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.