‘తెలుగోడి సత్తా చూపిద్దాం’.. కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌కు రేవంత్ రిక్వెస్ట్‌

'తెలుగోడి సత్తా చూపిద్దాం'.. కేసీఆర్‌, జ‌గ‌న్‌ల‌కు రేవంత్ రిక్వెస్ట్‌

ఇండియా కూటమి (India Alliance) ఉప రాష్ట్రపతి (Vice President) అభ్యర్థిగా జస్టిస్ (Justice) సుదర్శన్ రెడ్డి (Sudarshan Reddy)ని ప్రకటించడం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ కూటమి దుర్వినియోగం చేస్తోందని, మరోవైపు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతున్న ఇండియా కూటమి ఉన్నదని అన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఈ రెండు వైపుల పోరాటాన్ని ప్రజలు గమనించాలని కోరారు.

పీవీ నరసింహారావు (PV Narasimha Rao) తర్వాత తెలుగువాడిని ఇంత కీలక పదవిలో కూర్చోబెట్టే అవకాశం దక్కిందని సీఎం రేవంత్ అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలుగు వాడిపైన ఉందని పేర్కొన్నారు. ఇది రాజకీయాలు చేయాల్సిన సమయం కాదని.. “మనందరం ఒక్కటే” అనే భావనను ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ సభ్యుడు కాదని, రాజ్యాంగ పరిరక్షకుడిలా పనిచేస్తాడని రేవంత్ నమ్మకం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల లక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ(TDP), వైసీపీ(YSRCP), బీఆర్ఎస్(BRS), జనసేన(Janasena), ఎంఐఎం(MIM) పార్టీలు అన్నీ ఒకే లక్ష్యంగా సుదర్శన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. చంద్రబాబు (Chandrababu), కేసీఆర్ (KCR), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), జగన్(Jagan) లాంటి నేతలు అందరూ కలిసి పనిచేయాలని కోరారు. గతంలో పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్(NTR) సంపూర్ణ మద్దతు ఇచ్చిన ఉదాహరణను గుర్తుచేస్తూ.. ఇప్పుడు కూడా సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడం తెలుగువారందరి బాధ్యత అని రేవంత్ స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment