‘బాగా కాలిన‌ట్టుంది’.. – పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

'బాగా కాలిన‌ట్టుంది'.. - పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చేసిన కామెంట్ల‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీఎస్ శ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ ప్రెస్ మీట్‌తో ఎవరికో బాగా కాలినట్టు కనిపిస్తోందని ప‌వ‌న్‌ను ఉద్దేశించి ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. `మీకంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచాం కాబట్టి (ఇలా) అనకూడదు అని గింజుకుని గింజుకుని మరీ ఏడుస్తున్నారు!. ఇక జగన్‌కి ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, ఈ ఏడుపు అసెంబ్లీలోనే మొదలు పెట్టాల్సి వస్తుంది. అందుకేనా ఇవ్వంది?? అని ప్ర‌శ్నిస్తూ పీవీఎస్ శ‌ర్మ ట్వీట్ చేశారు.

ట్రెండింగ్‌లో వీడియోలు, మీమ్స్‌
బుధ‌వారం వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన వైఎస్ జ‌గ‌న్‌ మీడియా స‌మావేశంలో ఓ రిపోర్ట‌ర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌తిప‌క్ష హోదా కోసం జ‌ర్మ‌నీ వెళ్లాల‌ని ప‌వ‌న్ కామెంట్స్ చేస్తున్నార‌ని చెప్ప‌గా, అందుకు వైఎస్ జ‌గ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. పవన్ కార్పొరేటర్‌కు ఎక్కువ.. ఎమ్మెల్యేకు తక్కువ అని కౌంట‌ర్ వేశారు. జీవిత‌కాలంలో ఒక్క‌సారి ఎమ్మెల్యే అయ్యాడు అంటూ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం వైఎస్ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీడియోలు, మీమ్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

జ‌గ‌న్ మెజార్టీని అందుకోగ‌ల‌రా..?
వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్ ముగిసిన వెంట‌నే నారా లోకేశ్‌, నాదెండ్ల మ‌నోహ‌ర్ అసెంబ్లీ మీడియా పాయింట్ వ‌ద్ద‌కు మంత్రులు వ‌చ్చి ఓటింగ్ మెజార్టీ అంశాల‌ను లేవ‌నెత్తారు. ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా న‌డుచుకోవాల‌ని సూచిస్తూనే జ‌గ‌న్‌పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. మంత్రుల వ్యాఖ్య‌ల‌కు వైసీపీ కౌంట‌ర్ వేసింది. వైఎస్ జ‌గ‌న్ ఎంపీగా 5 ల‌క్ష‌ల‌కు పైగా మెజార్టీతో గెలిచారు, జ‌గ‌న్ మెజార్టీని అందుకోవ‌డానికి ఒక‌సారి మీరు ట్రై చేస్తారా..? అని ప్ర‌శ్నించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment