రేణుకా చౌదరిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు

రేణుకా చౌదరిపై సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury)పై సభా హక్కుల ఉల్లంఘనకు సంబంధించి అధికారిక ఫిర్యాదు (Complaint) నమోదైంది. పార్లమెంట్ రెండు సభలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పార్ల‌మెంట్ సమావేశాల ప్రారంభం రోజే రేణుకా చౌదరి తన కారులో కుక్క(Dog)ను వెంట‌ తీసుకువచ్చిన విషయం తీవ్ర చర్చనీయాంశం (Controversy) అయ్యింది. అనంతరం ఆమె చేసిన “కరిచే కుక్కలు సభలోనే ఉన్నాయి” అనే వ్యాఖ్య మరింత వివాదం రేపింది. ఈ వ్యాఖ్యలు పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశాయని ఇద్దరు ఎంపీలు ఇందు బాలగో స్వామి (Indu Balaghoswami), బ్రిజ్ లాల్ (Brij Lal) ప్రివిలేజ్ ఉల్లంఘనగా ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదును రాజ్యసభ చైర్మన్ పరిశీలించి, దానిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రివిలేజ్ కమిటీ (Privilege Committee)కి పంపారు. కమిటీ రేణుకా చౌదరి వ్యాఖ్యలు నిజంగానే సభా హక్కులను ఉల్లంఘించాయా లేదా అన్న దానిపై సమగ్రంగా విచారణ జరపనుంది. ఇక కమిటీ ఇవ్వబోయే నివేదికపై అందరి దృష్టి నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment