నా రెండో పెళ్లిపై మీకెందుకు అంత ఆసక్తి : రేణూ దేశాయ్ స్ట్రాంగ్ కౌంటర్

Summarize with AI

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, ప్రముఖ నటి రేణూ దేశాయ్ (Renu Desai) ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె ఎన్నో సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అయితే మీడియా దృష్టంతా ఆమె చేసిన రెండో పెళ్లి (Second Marriage) వ్యాఖ్యలపైనే కేంద్రీకరించడంపై రేణూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

“నేను ఎంతో సమాజాన్ని కదిలించే విషయాలు మాట్లాడాను. కానీ, మీడియా (Media) మాత్రం నా రెండో పెళ్లినే టార్గెట్ (Target) చేస్తోంది. ఎందుకు ఈ అత్యాశ (Greed)?” అంటూ ఆమె ప్రశ్నించారు. తన వయసు 44 సంవత్సరాలు అని గుర్తుచేసిన రేణూ.. “ఇంకా ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉంటే, పెళ్లే మీకెందుకు ముఖ్యం? మీ దృష్టిని దయచేసి మరలించండి” కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పాడ్‌కాస్ట్‌ (Podcast) లో మాట్లాడుతూ.. తనకు రెండో పెళ్లిపై ఆలోచన ఉన్నా, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు దాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. కూతురు ఆధ్య (Aadya) కు 18 ఏళ్లు వచ్చిన తర్వాతే పెళ్లి విషయమై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మీడియా స్పందనను గమనించిన రేణూ ఇలా కాస్త ఘాటుగానే స్పందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment