రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ల (PPI) వాలెట్‌లను ఉపయోగించి, థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం కేవైసీ చేసిన వినియోగదారులకు వర్తిస్తుంది.
ఇందులో భాగంగా, వినియోగదారులు తమ పీపీఐలతో యూపీఐ వ్యవస్థలో లావాదేవీలు చేయవచ్చు. ఈ కొత్త మార్పు భారతదేశంలో యూపీఐ వ్యవస్థకు మరింత శక్తినిచ్చేలా కనిపిస్తోంది. ఇది రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ చెల్లింపుల విస్తరణలో కీలకంగా మారనుంది.
థర్డ్-పార్టీ యాప్స్‌పై నిబంధనలు..
ప్రస్తుతం, పీపీఐ ప్రొవైడర్లు తమ వినియోగదారుల నుంచి డబ్బును ముందుగా డిపాజిట్ చేయించుకుని, వాటిని ప్రీపెయిడ్ కార్డులు లేదా వాలెట్ల రూపంలో ఉంచుతున్నారు. యూపీఐ విధానంలో ఆర్బీఐ చేసిన ఈ మార్పుతో, పీపీఐలను ఏదైనా యూపీఐ యాప్‌కి లింక్ చేసి చెల్లింపులు చేయవచ్చు. ఇది వినియోగదారుల కోసం మరింత సులభతరం చేస్తుంది.








‘ఆ హైదరాబాద్ వాడిని రానివ్వొద్దు.. వస్తే ఖతం చేస్తాడు!’