ఆర్బీఐకి బాంబు బెదిరింపు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపాయి. రష్యన్ భాషలో రాసిన ఈ బెదిరింపు మెయిల్ ఆర్బీఐ అధికారిక వెబ్‌సైట్‌కి చేరింది. “ఆర్బీఐను పేల్చేస్తాం” అంటూ ఈ-మెయిల్‌లో పేర్కొనడం, నెల వ్యవధిలో ఇదే రెండోసారి ఇలా జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

పోలీసుల అప్రమత్తత
మెయిల్ అందిన వెంటనే ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాలను తెలుసుకునేందుకు మాతా రమాబాయి మార్గ్ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. గత నవంబర్‌లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఆర్బీఐ కస్టమర్ కేర్ విభాగానికి లష్కరే తోయిబా సీఈఓ అని చెప్పుకున్న ఒక వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు.

ఢిల్లీలో స్కూల్స్‌కు కూడా బెదిరింపు
ఆర్బీఐ సంఘటనతో పాటు, ఈరోజు తెల్లవారుజామున ఢిల్లీలోని ఆరు ప్రముఖ పాఠశాలలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈస్ట్ ఆఫ్ కైలాష్ DPS, సల్వాన్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్‌లకు ఈ బెదిరింపులు ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. అయితే, పోలీసులు ఘటనా ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేపట్టినా అనుమానాస్పదంగా ఏమీ లభించలేదు.

ఆందోళనలో అధికార యంత్రాంగం
ఆర్బీఐ మరియు పాఠశాలలపై వరుస బెదిరింపులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వారిని గుర్తించడానికి పోలీసులు సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment