భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని ఆయన స్పష్టంగా తెలిపారు. కాంచీపురంలో రాజలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ క్రికెటర్ అశ్విన్. ఆ కార్యక్రమంలో హిందీ భాషపై వ్యాఖ్యలు చేశారు.
ఆయన ప్రసంగానికి ముందు, తాను ఏ భాషలో మాట్లాడాలి అని ప్రేక్షకులను అడిగారు. దీంతో ఇంగ్లీష్‌లో ప్రసంగించమని అందరూ చప్పట్లు కొట్టారు. తమిళం అనగానే పెద్దగా అరిచారు. హిందీ అనగానే ప్రేక్షకులు నిశ్శబ్దంగా నిలిచారు. ఈ సందర్భంగా అశ్విన్, హిందీ కేవలం అధికారిక భాష మాత్రమేనని స్పష్టం చేస్తూ, భారతీయ సమాజంలో భాషల వివిధతను గౌరవించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఎందుకు చర్చనీయాంశం?
తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఎక్కువగా ఉపయోగించానని అశ్విన్ తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కొన్ని వారాల వ్యవధిలోనే ఈ వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారింది. అశ్విన్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తమిళులు హిందీ భాషను ఉపయోగించరు. డీఎంకే ప్రభుత్వం సైతం హిందీని జాతీయ భాషగా ప్రకటించడాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్