కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్(Kannada Film Festival) వివాదంలో నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రష్మికపై చేసిన వ్యాఖ్యలను BJP, JDS తీవ్రంగా ఖండించాయి.
కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్. అశోక, అలాగే JDS నేత నిఖిల్ కుమారస్వామి రష్మికకు మద్దతుగా నిలిచారు. “నటీనటులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, మీరు చెప్పినట్టు ఆడాల్సిన అవసరం లేదు” అంటూ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యల(Congress Comments)పై విమర్శలు గుప్పించారు.
ఈ వివాదానికి కారణం, ఇటీవల కర్ణాటక ప్రభుత్వం నిర్వహించిన కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్‌కు రష్మిక సహా కొన్ని ప్రముఖ నటులు హాజరు కాకపోవడమే. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(DK Shivakumar) సినీ పరిశ్రమకు హెచ్చరికలు జారీ చేయడం మరింత దుమారం రేపింది. ఇప్పటికే పెద్దఎత్తున చర్చనీయాంశమైన ఈ వివాదం రాజకీయ వర్గాల్లో మరింత వేడి పుట్టించనుంది.