స్టోరీ డిమాండ్ చేస్తే బామ్మ పాత్ర అయినా చేస్తా..

స్టోరీ డిమాండ్ చేస్తే బామ్మ పాత్ర అయినా చేస్తా..

నేష‌న‌ల్ క్ర‌ష్‌, నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) సినిమాల ఎంపిక విషయంలో త‌న ఆలోచ‌న విధానాన్ని రివీల్ చేశారు. త‌న థాట్‌ప్రాసెస్ ఎలా ఉంటుందో పంచుకున్నారు. ర‌ష్మిక మాట్లాడుతూ.. “జీవితాన్ని సీరియస్‌గా తీసుకోను. ఒక సినిమా కథ బాగుంటే, అవసరమైతే బామ్మ పాత్రనైనా చేస్తా!” అని అన్నారు.

రష్మిక తాజా చిత్రం “ఛావా” (Chhava Movie) ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. సినిమాపై హిట్ టాక్ వస్తుండటంతో ఆమె ఆనందం వ్యక్తం చేశారు. “ప్రేక్షకులకు నచ్చే పాత్రలు చేయడమే నా లక్ష్యం” అంటూ తన సినిమాల ఎంపిక గురించి చెప్పుకొచ్చారు. జాన‌ర్‌తో కాకుండా క‌థ‌కు మాత్ర‌మే తాను ప్రాధాన్యం ఇస్తాన‌ని ఆమె మాటల్లో వ్య‌క్తం అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment