పాన్-ఇండియా స్టార్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఈ నెల 5న తన 29వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ (Instagram) లో షేర్ చేస్తూ, “నాకు 29 ఏళ్లు వచ్చాయనేది నాకే నమ్మశక్యంగా లేదు” అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. ఇదే కాకుండా “వయసు (Age) పెరిగే కొద్దీ పుట్టినరోజును మరింత ఉత్సాహంగా జరుపుకోవాలని అనిపిస్తోంది” అంటూ తన బర్త్‌డే మంత్ గురించి పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ ‘కుబేరా (Kubera)’, ‘ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend)’ సినిమాల్లో నటిస్తుండగా, ఆమె నటించిన ‘సికందర్ (Sikandar)’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. సల్మాన్ ఖాన్‌తో జోడీగా రష్మిక నటించిన ‘సికందర్’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది.