2025 ప్రారంభమై అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయి. సినిమా పరిశ్రమకు (Cinema Industry) సంబంధించి ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలే వచ్చాయి. కానీ, ఒక టాలీవుడ్ హీరోయిన్ మాత్రం గడిచిన ఈ ఆరు నెలల కాలంలో ఏకంగా మూడు బ్లాక్‌బస్టర్ హిట్స్ సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna).
ప్రస్తుతం ఈ స్టార్ హీరోయిన్‌కు శుక్ర మహర్దశ పీక్స్ లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, 2025 మొదటి భాగంలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు ఒక్క హిట్టు లేక సతమతమవుతుంటే, రష్మిక మాత్రం ఏకంగా మూడు (Three) భారీ బ్లాక్‌బస్టర్లను (Massive Blockbusters) తన ఖాతాలో వేసుకుంది. కేవలం ఆరు నెలల్లోనే ఈ బ్యూటీ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టాయి. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్, డిమాండ్ ఈ ముద్దుగుమ్మకు ఉంది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలకు ఈ ముద్దుగుమ్మ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అందుకే దర్శకనిర్మాతలు ఈ బ్యూటీ డేట్స్ కోసం క్యూ కడుతున్నారు.
ఈ ఏడాదే కాదు, గత ఏడాదిలోనూ ఈ సొగసరి హవా నడిచింది. ఆమె హీరోయిన్‌గా నటించిన ఒక సినిమా ఏకంగా రూ. 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండో సినిమాగా రికార్డులకెక్కింది. ఈ మధ్యనే ఓ సీనియర్ హీరో ఒక సందర్భంలో మాట్లాడుతూ, రష్మికకు శుక్ర మహర్దశ నడుస్తోందని అన్నారు. ఆమె ప్రస్తుత జోరు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద గోల్డెన్ గర్ల్‌గా మారిపోయింది రష్మిక.
2025లోనూ కొనసాగుతున్న జోరు:
గతేడాది రష్మిక నటించిన ‘పుష్ప 2’ సినిమా ఏకంగా రూ.2000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ ఏడాది విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె నటించిన ‘ఛావా’ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ హిస్టారికల్ డ్రామా ఏకంగా రూ.800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. బాలీవుడ్‌లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమా ఇదే. ‘ఛావా’ తర్వాత సల్మాన్ ఖాన్‌తో రష్మిక చేసిన ‘సికందర్’ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వరల్డ్‌వైడ్‌గా రూ.177 కోట్లు రాబట్టింది.