‘నేషనల్ క్రష్’ రష్మిక మందన్న (Rashmika (Rashmika)) ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా ఆమె నటిస్తున్న చిత్రాలన్నీ దాదాపు రూ. 100 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించుకుంటున్నాయి. దీంతో ఆమె వరుసగా హండ్రెడ్ క్రోర్ (Hundred Crore) మూవీస్‌ను తన ఖాతాలో వేసుకుని ‘వంద కోట్ల గ్యారెంటీ హీరోయిన్‌గా’ గుర్తింపు తెచ్చుకుంది.
ఆమె నటించిన ‘వారిసు’ (Varisu) నుంచి ఇటీవల విడుదలైన ‘ధమా’ (Dhamma) వరకు అనేక చిత్రాలు ఈ మార్కును దాటాయి. ముఖ్యంగా హిందీలో ‘యానిమల్’, రణ్‌బీర్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవగా, ‘పుష్ప 2’ మరియు ‘ఛావా’ కూడా భారీ విజయాలు సాధించాయి.
రష్మిక ఖాతాలో ఇటీవల చేరిన మరో వంద కోట్ల చిత్రం ‘ధమా’. ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. అంతేకాకుండా, ఇది ఆయుష్మాన్ ఖురానా కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాసర్‌గా నిలిచింది. ఈ ఏడాది ఇప్పటికే నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన రష్మిక, తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించింది. నవంబర్ 7న ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ విడుదల కానుంది. వీటితో పాటు, విజయ్ దేవరకొండతో కలిసి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలోనూ రష్మిక హీరోయిన్‌గా ఖరారైంది.





 



