విక్టరీ వెంకటేశ్- రానా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదే స్థాయిలో విమర్శలను సైతం ఎదుర్కుంది. రానా నాయుడు సీజన్ 2పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సిరీస్ గురించి వెంకటేశ్ ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీజన్ 2పై ప్రత్యేక జాగ్రత్తలు!
‘రానా నాయుడు’ సీజన్ 1కి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. అవి సీజన్ 2లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం,” అని వెంకటేశ్ స్పష్టం చేశారు. నిర్మాతలు కూడా ఈ సీజన్‌ను మరింత ప్రామాణికంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ డబ్బింగ్ ఇప్పటికే పూర్తి కాగా, మార్చిలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సీజన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇస్తుందేమో రిలీజ్ అయ్యేంత వరకు వేచి చూడలి.