ఆన్లైన్ బెట్టింగ్ (Online Betting) యాప్‌లను (Apps) ప్రమోట్ (Promote) చేసిన కేసులో సినీ నటుడు రానా (Rana Daggubati)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని ఆ సమన్లలో పేర్కొంది.
వాస్తవానికి నేడు (జులై 23) రానా ఈడీ విచారణకు హాజరు కావాల్సింది. అయితే, ఆయన గడువు పొడిగించాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. దీంతో తాజాగా మరో తేదీని ఖరారు చేస్తూ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 11న కచ్చితంగా హాజరు కావాలని సమన్లలో స్పష్టం చేసింది.
సైబరాబాద్, సూర్యాపేట, పంజగుట్ట, మియాపూర్, విశాఖపట్నంలో లోన్ యాప్‌లపై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ను రిజిస్టర్ చేసిన విషయం తెలిసిందే. లోన్ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సహా మొత్తం 29 మందిని ఈ ఈసీఐఆర్‌లో చేర్చింది.