కేంద్ర‌మంత్రి రామ్మోహన్‌కి భద్రత పెంపు

కేంద్ర‌మంత్రి రామ్మోహన్‌కి భద్రత పెంపు

భారత్–పాకిస్థాన్ (India–Pakistan) మధ్య ఉద్రిక్తతలు ఉధృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర‌మంత్రుల భ‌ద్ర‌త‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిసారించింది. ఈ నేప‌థ్యంలో పౌర విమానయాన శాఖ మంత్రి (Civil Aviation Department Minister) కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu)కి కేంద్రం భద్రత (Security)ను పెంచింది (Increased). ఇప్పటివరకు ఆయనకు Y కేటగిరి (Y category) భద్రత ఉండ‌గా, తాజా పరిస్థితుల కార‌ణంగా Y ప్ల‌స్ కేటగిరీ (Y-plus category)కి మార్చింది.

ప్ర‌స్తుతం రామ్మోహ‌న్ నాయుడుకు ఉన్న భ‌ద్ర‌తా సిబ్బందికి అదనంగా మ‌రో నలుగురు సిబ్బందిని చేర్చారు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఇద్ద‌రు, కేంద్రం నుంచి ఇద్ద‌రు సీఆర్‌పీఎఫ్ (CRPF) సిబ్బంది కేంద్ర‌మంత్రికి భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు. మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు భద్రత కల్పిస్తుండ‌గా, వీరికి అద‌నంగా మ‌రో న‌లుగురిని పెంచుకుతూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

‘#OperationSindoor’ కింద భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పాక్‌పై ఇండియ‌న్ ఆర్మీ దాడులు కొన‌సాగుతుండ‌డంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కీలక కేంద్ర మంత్రుల భద్రతపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment