సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సాధారణంగా బ్రాండ్ యాడ్స్ కోసం భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటారు. కానీ, కొందరు మాత్రం డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారిలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒకరని మరోసారి నిరూపించాడు.
తాజాగా రామ్ చరణ్‌కు ఓ ప్రముఖ బ్రాండ్ నుంచి భారీ యాడ్ ఆఫర్ వచ్చింది. ఈ యాడ్ కోసం ఏకంగా రూ.15 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినా, ఆయన వెంటనే తేలిగ్గా “నో” అన్నారని సమాచారం. అసలు ఆ యాడ్ ఏ బ్రాండ్‌దంటే – చిన్న పిల్లలకు హానికరమైన కెమికల్స్ ఉన్న ఒక ప్రాడక్ట్‌కు సంబంధించినదట.
ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్, “ఇది పిల్లల ఆరోగ్యానికి హానికరం, ఇటువంటి ఉత్పత్తుల్ని ప్రమోట్ చేయడం మంచిదికాదని” సూటిగా తిరస్కరించాడట. పైగా తన ఫ్యామిలీ ఇమేజ్, వ్యక్తిగత విలువలకు భంగం కలగకూడదనే అభిప్రాయం కూడా ఆయనకు ఉండటంతో, ఆ యాడ్‌ను పూర్తిగా వదిలేశాడట.
ఇదే బ్రాండ్‌ను గతంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ ప్రమోట్ చేసినట్టు, ఆ తర్వాత ఆరోపణలు ఎదురయ్యాయని సమాచారం. అందుకే రామ్ చరణ్ ముందస్తుగా జాగ్రత్త పడ్డారని అంటున్నారు.
ఈ నిర్ణయంపై మెగా ఫ్యాన్స్ కాకుండాా.. సామాన్య నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు .
“ఇదే నిజమైన స్టార్ ఆటిట్యూడ్,”
“ఆరోగ్యం ముఖ్యం అనేది చరణ్ క్లాస్,”
“తన విలువలకు కట్టుబడి ఉండే హీరో” అంటూ పొగడ్తలతో ముంచేస్తున్నారు.