కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన వక్స్ (Waqf) సవరణ బిల్లు (Amendment Bill) కు రాజ్యసభ (Rajya Sabha) ఆమోదం (Approval) తెలిపింది. లోక్‌సభలో ఇప్పటికే ఆమోదం పొందిన ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభలోనూ విజయవంతమైంది. బుధవారం లోక్‌సభలో సుదీర్ఘ చర్చల అనంతరం వక్ఫ్ బిల్లుకు ఆమోదం లభించింది. మరుసటి రోజు గురువారం బిల్లును రాజ్యసభకు పంపించారు. మధ్యాహ్నం తరువాత రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. గురువారం అర్ధరాత్రి వరకు బిల్లుపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. అనంతరం బిల్లుకు అనుకూంలగా 128 మంది సభ్యులు ఓటు వేయగా, వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. బిల్లుపై సభలో అర్ధరాత్రి దాటే వరకు హీటెడ్ డిబేట్ (Heated Debate) జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం బిల్లుకు ఆమోదం లభించింది.
ఈ బిల్లుతో వక్స్ ఆస్తులపై నియంత్రణ మరింత బలపడనుంది. అయితే కొన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ, కేంద్రం దీన్ని సమర్థంగా ప్రాతినిధ్యం వహించింది.