రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘కూలీ’

రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘కూలీ’

సూపర్‌స్టార్ (Superstar) రజనీకాంత్ (Rajinikanth) మరోసారి తన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో బాక్సాఫీస్ వద్ద రుజువు చేశారు. ఆగస్టు 14న ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కూలీ’ (‘Coolie’) సినిమా, కేవలం రెండు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ వేగం అభిమానులను మాత్రమే కాదు, ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది.

సినిమా యూనిట్ సమాచారం ప్రకారం, విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రజనీకాంత్ కెరీర్‌లో ఇదొక రికార్డు స్థాయి కలెక్షన్‌గా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని సెన్సేషనల్ రికార్డులు నమోదు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మేకర్స్ నుంచి త్వరలోనే అధికారిక కలెక్షన్ రిపోర్ట్ విడుదల కానుంది. అయితే ట్రేడ్ సర్కిల్స్ (Trade Circles) మాత్రం ఇప్పటికే ఈ సినిమా సునామీపై విశేషంగా చర్చించుకుంటున్నాయి. రజనీ మాస్ హవా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment