రాజమౌళి ‘వారణాసి’కి రూ.1300 కోట్ల బడ్జెట్…

రాజమౌళి ‘వారణాసి’కి రూ.1300 కోట్ల బడ్జెట్…

‘బాహుబలి’, ‘RRR’ వంటి వరల్డ్ రికార్డ్ హిట్స్ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా, భారతీయ సంస్కృతి, పురాణాలు, సైన్స్ ఫిక్షన్‌లను మేళవించి ప్రపంచ స్థాయిలో కొత్త విజువల్ అనుభూతిని అందించబోతోందని టాక్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో శరవేగంగా జరుగుతుండగా, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో కూడిన అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ‘వారణాసి’ ప్రేక్షకులను ఉర్రూతలూగించనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌కు నేరుగా పారితోషికం తీసుకోకుండా, మొత్తం ఓవర్సీస్ హక్కులను తన రెమ్యూనరేషన్‌గా తీసుకున్నట్లు సమాచారం, దీని విలువ రూ.160 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. మహేశ్ బాబు కూడా లాభాల్లో వాటా పద్ధతిలో రూ.150 నుంచి రూ.200 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉందట. హీరోయిన్‌గా నటిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు రూ.30–40 కోట్ల వరకు పారితోషికం ఆఫర్ చేసినట్లు టాక్. రాజమౌళి బ్రాండ్, మహేశ్ బాబు క్రేజ్ కలిసి ‘వారణాసి’ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment