దర్శకధీరుడు (Darsakadhīruḍu) రాజమౌళి (Rajamouli) ఏం చేసినా ముందుగానే ప్రణాళికతోనే చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబు (Mahesh Babu)తో తీస్తున్న SSMB29 సినిమా కోసం ఓ భారీ ప్లాన్ చేస్తున్నాడట. ఈసారి ఏకంగా ఆస్కార్ అవార్డు (Oscar Award)పైనే కన్నేసినట్టు తెలుస్తోంది. ‘ట్రిపుల్ ఆర్’ (RRR) సినిమాతో ఇప్పటికే ఒక ఆస్కార్ తీసుకొచ్చిన రాజమౌళి, ఇప్పుడు ఇంకోదాని కోసం పెద్ద స్కెచ్ వేస్తున్నాడనే చర్చ జరుగుతోంది. తెలుగు నిర్మాణ సంస్థలతో సినిమా తీసినప్పుడు ప్రతీసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోంది, దీనివల్ల ఆస్కార్ అవార్డులు గెలిచే అవకాశాలు తగ్గుతున్నాయని ఆయన భావిస్తున్నారట. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.
హాలీవుడ్ బ్యానర్‌తో సంయుక్త నిర్మాణం?
తెలుగు బ్యానర్ మీద కాకుండా హాలీవుడ్ బ్యానర్‌ను ప్రధాన నిర్మాణ సంస్థగా చూపించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందుకోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థలతో ఆయన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఇది కుదిరితే, హాలీవుడ్ నిర్మాణ సంస్థను మొదటి ప్రొడ్యూసర్‌గా, కేఎల్ నారాయణను రెండో సంస్థగా చూపించే అవకాశం ఉంది.
ఈ వ్యూహం ద్వారా సినిమాను నేరుగా హాలీవుడ్ కోటాలో ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయొచ్చు. అప్పుడు ఎక్కువ విభాగాల్లో ఆస్కార్‌కు నామినేషన్స్ వేయడానికి అవకాశం లభిస్తుంది. అయితే దీనికి ఒక షరతు ఉంది. సినిమా షూటింగ్‌ను నేరుగా ఇంగ్లిష్‌లో చేయాల్సి ఉంటుంది. ఇది పెద్ద కష్టం కానప్పటికీ, నిర్మాణ వ్యయం కొంత పెరుగుతుంది. ఈ లెక్కలన్నీ రాజమౌళి కుమారుడు కార్తికేయ చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.