రాజమండ్రిలో హీరో రామ్.. అర్ధరాత్రి అగంతకుల హైడ్రామా!

రాజమండ్రిలో హీరో రామ్ రూమ్‌లోకి చొరబాటు..అర్ధరాత్రి హైడ్రామా!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ (Ram) నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్’ (Andhra King) తాలూకా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని రాజమండ్రి (Rajahmundry)లో జరుగుతోంది. ఈ క్రమంలో రామ్ రాజమండ్రిలోని షెరటాన్ హోటల్‌ (Sheraton Hotel)లో బస చేస్తుండగా, అతని రూమ్ దగ్గర ఓ హైడ్రామా (High drama) చోటుచేసుకుంది.

సోమవారం రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్‌కు చేరుకున్న రామ్, 6వ అంతస్తులోని వీఐపీ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అయితే అర్ధరాత్రి 10 గంటల ప్రాంతంలో, ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు (Unknown Persons) హీరో రామ్ స్టాఫ్‌లో భాగమని చెప్పుకుంటూ హోటల్ సిబ్బందిని సంప్రదించి, లిఫ్ట్ యాక్సెస్ కోరారు.

మొదట అనుమతించడానికి నిరాకరించిన హోటల్ యాజమాన్యం, వారి మాటలు నమ్మి యాక్సెస్ మంజూరు చేసింది. ఆ ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్‌లో 6వ అంతస్తులోని రామ్ గది వద్దకు చేరుకుని, మాస్టర్ కీ ఇవ్వాలని హౌస్ కీపింగ్ సిబ్బందితో వాదనకు దిగారు. కీ తీసుకున్న ఆ ఇద్దరు దాన్ని ఉపయోగించి రామ్ గదిలోకి ప్రవేశించారు.

అయితే, అది వీఐపీ సూట్ కావడంతో, ఆ గదిలో లోపల మరో బెడ్‌రూమ్ ఉంది, అక్కడ రామ్ తలుపు లాక్ చేసి నిద్రిస్తున్నాడు. ఆ ఇద్దరు రామ్ నిద్రిస్తున్న రూమ్ డోర్‌ను గట్టిగా తట్టడంతో, మేల్కొన్న రామ్ ఏదో జరుగుతుందని గ్రహించి వెంటనే తన పర్సనల్ సెక్యూరిటీని లైన్‌లోకి తీసుకున్నాడు. వాళ్లు వెంటనే రామ్ రూమ్ వద్దకు చేరుకుని ఆ ఇద్దరు అగంతకులను పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై హోటల్ యాజమాన్యం పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment