అదిరిపోయిన రాజా సాబ్ టీజర్.. రెబల్ ఫ్యాన్స్ పుల్ జోష్

అదిరిపోయిన రాజా సాబ్ టీజర్.. రెబల్ ఫ్యాన్స్ పుల్ జోష్


యంగ్ రెబల్ స్టార్ (Young Rebel Star) ప్రభాస్ (Prabhas) నటిస్తున్న సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ప్రభాస్.. ఇప్పుడు హారర్ కామెడీ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. అదే ‘రాజా సాబ్’ (Raja Saab). డైరెక్టర్ మారుతి (Maruthi) తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

భారీ విజయాల తర్వాత ‘రాజా సాబ్’
‘సలార్’, ‘కల్కి’ వంటి భారీ హిట్స్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘రాజా సాబ్’ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ‘సలార్’ సినిమా రూ. 700 కోట్లకు పైగా వసూలు చేయగా, ‘కల్కి’ రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి నయా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’గా ప్రభాస్ రానున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు (Posters), గ్లింప్స్‌లు (Glimpses) ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో (Dual Roles) కనిపించనున్నాడు. అలాగే, ముగ్గురు అందాల భామలు ఆయనకు జోడీగా నటించనున్నారు.

టీజర్‌తో వింటేజ్ ప్రభాస్ గ్లింప్స్
‘రాజా సాబ్’ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan), రిధి కుమార్ (Ridhi Kumar) హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘రాజా సాబ్’ టీజర్ (Teaser) సినీ ప్రియులను ఆకట్టుకుంది. ప్రభాస్ లుక్స్ అద్భుతంగా ఉన్నాయని, ఫ్యాన్స్ ప్రభాస్‌ను ఎలా చూడాలనుకుంటున్నారో మారుతి అలా చూపించాడని అంటున్నారు. టీజర్‌లో వింటేజ్ ప్రభాస్ కనిపించాడు. హారర్ కంటెంట్‌తో పాటు మారుతి మార్క్ కామెడీ కూడా ‘రాజా సాబ్’లో అదిరిపోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది.

ప్రభాస్ మొదటిసారి హారర్ కంటెంట్ ఉన్న కథతో సినిమా చేస్తుండటం విశేషం. ప్రభాస్ టైమింగ్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజరే ఈ స్థాయిలో ఉందంటే ట్రైలర్ ఎలా ఉంటుందో, సినిమా ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా చేయనున్నాడు ప్రభాస్. అలాగే, ‘కల్కి 2’లోనూ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్నాడు.

Join WhatsApp

Join Now

Leave a Comment