ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో సిట్ (SIT) నోటీసులపై కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి (Kasireddy Rajasekhar Reddy) స్పందించారు. లిక్కర్ కేసుపై స్పందిస్తూనే వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్‌పై వివరణ ఇస్తూ ఓ ఆడియో (Audio)ను రాజ్ కసిరెడ్డి విడుదల చేశారు. కసిరెడ్డి ఆడియో సంచలనంగా మారింది.
లిక్కర్ కేసులో తనకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలన్నారని రాజ్ కసిరెడ్డి అంగీకరించారు. నోటీసులపై 24 గంటల్లోనే తాను స్పందించానని వివరించారు. విచారణకు సహకరిస్తానని చెప్పానని, తనను ఎందుకు రమ్మంటున్నారు, ఏమైనా డాక్యుమెంట్స్ తేవాలా అని అడిగానన్నారు. తాను మెస్సేజ్ పెట్టాక రెండో నోటీసు ఇచ్చారని, కేసులో ప్రాథమిక సమాచారం ఇవ్వాలని కోరానన్నారు. మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, తాను లేని టైమ్‌లో తన తల్లి (Mother) కి నోటీసులు ఇచ్చారని రాజ్ కసిరెడ్డి రిలీజ్ చేసిన ఆడియోలో వివరించారు. సాక్షిగా తనకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మన్నారని, నోటీసులు అందాక తన లాయర్లతో మాట్లాడానని చెప్పారు. సాక్షిగా విచారణకు పిలిచి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని లాయర్లు చెప్పారని, తకు వచ్చిన నోటీసులను హైకోర్టు (High Court) లో సవాల్ చేశానని, ముందస్తు బెయిల్ పిటిషన్ (Anticipatory Bail Petition) కూడా వేశానని చెప్పారు. విచారణకు పూర్తిగా సహకరిస్తా, న్యాయ సలహా తీసుకున్నాక విచారణకు వస్తానని చెప్పారు.
నిన్న సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి క్రిమినల్ మైండెడ్ అని వ్యాఖ్యానించారు. విజయసాయి వ్యాఖ్యలకు రాజ్ కసిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) ఒక బట్టేబాజ్ (Fraudster) మనిషి, విజయసాయి చరిత్ర (History)ను త్వరలో అందరి ముందు పెడతానని రాజ్ కసిరెడ్డి సంచలన వ్యాఖ్యలు (Sensational Comments) చేశారు. నిజాలు తెలుసుకునేంత వరకు వన్‌సైడ్ వార్తలు వేయకండి అని కోరారు.
రాజ్ కసిరెడ్డి ఆడియో