---Advertisement---

రాజ‌కీయం మారిపోయింది.. – రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

రాజ‌కీయం మారిపోయింది.. - రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
---Advertisement---

హైదరాబాద్‌‌లోని హెచ్ఐసీసీ వేదికగా భారత్‌ సమ్మిట్-2025 రెండో రోజు కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరై కీలక వ్యాఖ్యలు చేశారు. తన భారత్ జోడో యాత్ర అనుభవాలను ఈ సందర్భంగా పంచుకున్న ఆయన, సమకాలీన రాజకీయాల పరిణామాలపై విశ్లేషణ చేశారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధిపై కొన్ని ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. వివిధ దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “భారత్ సమ్మిట్‌కు నిన్నే రావాల్సి ఉండేది. కానీ కాశ్మీర్ వెళ్లిన కారణంగా ఆలస్యం అయింది. అందుకు క్షమించండి.” అన్నారు. అలాగే, ఈ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు. “ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య రాజకీయాలు గణనీయంగా మారిపోయాయి. పదేళ్ల కిందటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు కనిపించడం లేదు. మోడ్రన్ సోషల్ మీడియా ప్రభావంతో రాజకీయాలు మారిపోయాయి. ప్రతిపక్షాల గొంతు ముట్టడించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. సభల్లో విపక్షాలకు మాట్లాడే అవకాశం లేకుండా పోతోంది” అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారత్ జోడో జీవిత పాఠాలు
“భారత్ జోడో యాత్రలో 4,000 కిలోమీటర్ల ప్రయాణం చేశాను. కన్యాకుమారి నుంచి పాదయాత్ర ప్రారంభించిన పదో రోజుకు నాతో పాటు నడిచే వారి సంఖ్య పెరిగిపోయింది. ఈ యాత్రలో అనేక విషయాలను నేర్చుకున్నాను,” అని రాహుల్ వివరించారు. “యాత్ర సగం పూర్తయేసరికి నేను పూర్తిగా మారిపోయాను. ప్రజలతో ఎలా మాట్లాడాలో, వారి సమస్యలను ఎలా వినాలో నేర్చుకున్నాను. గతంలో నేను ప్రజలపై నా ప్రేమను స్పష్టంగా వ్యక్తం చేయలేకపోయాను. అయితే భారత్ జోడో యాత్రలో ప్రజలపై ఉన్న నా ప్రేమను వ్యక్తం చేయగలిగాను. అప్పటి నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందని” రాహుల్ గాంధీ వివ‌రించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment