---Advertisement---

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట
---Advertisement---

సావర్కర్ పరువు నష్టం కేసులో లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీకి పూణే ప్రత్యేక కోర్టు భారీ ఊరటనిచ్చింది. ఈ కేసులో కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసి తదుపరి విచారణను ఫిబ్రవరి 18కు వాయిదా వేసింది. 2023లో లండన్ పర్యటన సమయంలో రాహుల్ గాంధీ సావర్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సావర్కర్ మనవడు సత్యకీ సావర్కర్ ఫిర్యాదు దాఖలు చేయడంతో రాహుల్ గాంధీపై కేసు న‌మోదైంది.

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సావర్కర్ ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేశారని, త‌మ‌ కుటుంబ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా రాహుల్ వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని సావ‌ర్క‌ర్ మ‌న‌వ‌డు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచార‌ణ చేప‌ట్టిన పూణే ప్ర‌జాప్ర‌తినిధుల కోర్టు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీని విచారించింది. ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసుపై త‌దుప‌తి విచార‌ణ‌ను ఫిబ్ర‌వ‌రి 18కి వాయిదా వేసింది.

రాహుల్ గాంధీని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విచార‌ణ చేయ‌డంపై సత్యకీ సావర్కర్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.కీలక కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment