ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌కు బరిలోకి దిగనున్న భారత జట్టుకు మేనేజర్‌గా తెలుగు వ్యక్తి పీవీఆర్ ప్రశాంత్ నియమితులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రశాంత్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1997లో వెస్టిండీస్ పర్యటనలో డీవీ సుబ్బారావు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయన తర్వాత, దాదాపు 28 సంవత్సరాలకు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరొక వ్యక్తికి ఈ అవకాశం లభించడం విశేషం.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9న ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. టోర్నీలో తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. భారత్ తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.
ఈ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఈ జట్టులో తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు కూడా చోటు దక్కింది. దీంతో ప్రస్తుతం భారత జట్టులో మేనేజర్‌తో పాటు ఇద్దరు తెలుగువారు ఉన్నారు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్