పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు

పులివెందులలో ఉద్రిక్తత.. టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని కడప జిల్లా (Kadapa District) పులివెందుల (Pulivendula) జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికలు (By Elections) తీవ్ర ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) భారీ స్థాయిలో ఎన్నికల రిగ్గింగ్‌ (Rigging)కు పాల్ప‌డుతున్న‌ట్లుగా స్థానిక ప్ర‌జ‌లు, వైసీపీ(YSRCP) తీవ్ర‌ ఆరోపణలు చేసింది. టీడీపీ కార్యకర్తలు ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రానివ్వకుండా అడ్డంకులు సృష్టిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారని వైసీపీ నాయకులు మండిప‌డ్డారు. అంతేకాక, వైసీపీ ఏజెంట్లను బలవంతంగా పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు పంపిస్తున్నారని, ఈ చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని వైసీపీ తీవ్రంగా ఖండించింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వీడియోలు సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నంగా మారాయి.

వైసీపీ ఆరోపణల ప్రకారం, పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించకుండా టీడీపీకి మద్దతుగా పక్షపాతం చూపుతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఓటర్లను బెదిరిస్తూ, పోలింగ్ బూత్‌ల వద్ద జమ్మలమడుగు నుంచి తెచ్చిన వ్యక్తులు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసీపీ వీడియో ఆధారాలతో సహా ఆరోపించింది. నల్లపురెడ్డిపల్లి పోలింగ్ బూత్ వద్ద జరిగిన ఘటనలను చూపిస్తూ, వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి ఇంటి చుట్టూ టీడీపీ కార్యకర్తలు గుమిగూడి, ఏజెంట్లను అడ్డుకున్నారని పేర్కొంది. ఈ ఘటనలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC), డీజీపీలకు ఫిర్యాదు చేసిన వైసీపీ, నిష్పాక్షిక ఎన్నికల కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

పులివెందుల వైఎస్ కుటుంబ బలగం అయినప్పటికీ, ఈ ఉప ఎన్నిక టీడీపీ, వైసీపీల మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. టీడీపీ నాయకుడు బీటెక్ రవి, వైసీపీ ఆరోపణలను “ఓటమి భయంతో చేస్తున్న కుట్ర”గా తోసిపుచ్చారు. అయితే, టీడీపీ దౌర్జ‌న్య చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ “టీడీపీ ఓటమి భయంతో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోంది” అని ఆరోపించారు. ఈ ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఉద్రిక్తతను రేకెత్తించాయి, ఎన్నికల సంఘం, పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపును తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment