పులివెందుల (Pulivendula)లో జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నిక (By Election) సందర్భంగా పోలీసులు (Police), వైఎస్సార్సీపీ కార్యకర్తల (YSRCP Workers) మధ్య ఉద్రిక్తత నెలకొంది. డీఐజీ (DIG) కోయ ప్రవీణ్ (Koya Praveen) ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మంగళవారం మధ్యాహ్నం వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చారు. కడప ఎంపీ (Kadapa MP)వైఎస్ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy)ని ఆఫీసులోనే నిర్బంధించారు.
పోలీసులు ఆఫీసు వద్దకు వచ్చినప్పుడు వైఎస్సార్సీపీ కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించారు. కొందరు కార్యకర్తలు పోలీసుల కాళ్ళు పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఎంపీ అవినాష్ రెడ్డి వారిని వారించారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు, లోకేష్‌లు పులివెందుల మీద పగబట్టారని ఆరోపించారు. రిగ్గింగ్ (Rigging) జరిగినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, పోలీసులు చేయాల్సిన నష్టం చేశారని అన్నారు. తమ కార్యకర్తలు సంయమనం పాటించాలని, అన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు.
అయితే, భద్రత కల్పించడానికే వచ్చామని పోలీసులు చెప్పగా, తమకు భద్రత అవసరం లేదని, తమను ఓటు వేయనివ్వాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులు కోరాయి. అయినప్పటికీ, డీఐజీ కోయ ప్రవీణ్ అక్కడే ఉండి అవినాష్ రెడ్డిని ఆఫీసులో నిర్బంధించారు.
అంతకు ముందు, ఉదయం అవినాష్ రెడ్డిని పోలీసులు ఆయన నివాసం నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత విడుదలైన అవినాష్ రెడ్డి కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికలలో దౌర్జన్యం, బూత్ క్యాప్చర్, రిగ్గింగ్ వంటివి యథేచ్ఛగా జరిగాయని ఆరోపించారు. కోర్టును ఆశ్రయించడం తప్ప తమకు మరో మార్గం లేదని అన్నారు. టీడీపీ ఈ ఎన్నిక గెలిచినా ప్రజల్లో మాత్రం తాము అనుకున్నది సాధించలేదని, ప్రజలు ఈ ఎన్నికలు ఎలా జరిగాయో చూశారని చెప్పారు. కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తే టీడీపీకి ఇబ్బందులు తప్పవని అవినాష్ రెడ్డి అన్నారు.