పులివెందులలో ఉద్రిక్తత: వైసీపీ ఎమ్మెల్సీపై టీడీపీ దాడి (Video)

పులివెందులలో ఉద్రిక్తత: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పై టీడీపీ దాడి

పులివెందుల (Pulivendula)లో జెడ్పీటీసీ (ZPTC) ఉప ఎన్నికల (By-Elections) వేళ తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పులివెందుల (Pulivendula) మండలం నల్లగొండువారిపల్లి (Nallagonduvaripalli)లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న వైసీపీ (YSRCP) ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌ (Ramesh Yadav), ఆ పార్టీ నాయ‌కుడు వేల్పుల రాము (Velpula Ramu)పై టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దాడి చేశారు. ఇనుప రాడ్లు, క‌ర్ర‌ల‌తో విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు. టీడీపీ దాడిలో ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్‌ (Ramesh Yadav), రాము తీవ్ర గాయాలు కావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

దాడికి గురైన ఎమ్మెల్సీ ర‌మేష్‌, రాము
ప్రాథమిక సమాచారం మేరకు – కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్న వైసీపీ నాయకుడు రాముపై, టీడీపీ(TDP)కి చెందిన గుంపు సభ్యులు విచక్షణ లేకుండా దాడికి పాల్పడ్డారు. అదే సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కూడా వారి లక్ష్యంగా మారారు. దాడిలో నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామును పోలీసులు తమ వాహనంలోనే పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది. సమాచారం అందుకున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆసుపత్రికి చేరుకుని రామును పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు.

ఉపఎన్నికల వేళ శాంతి భద్రతలపై ప్రశ్నలు
ఈ దాడుల నేపథ్యంలో పులివెందుల ఉపఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలు సవాలుగా మారినట్లు స్పష్టమవుతోంది. అధికార పార్టీ నేతలే ఈ స్థాయిలో దాడులకు గురవుతున్నారంటే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment