తేలిన నిర్మాతల నిర్ణయం.. టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

తేలిన నిర్మాతల నిర్ణయం.. టీజీ విశ్వప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమ (Telugu Film Industry) లో కార్మికుల వేతనాల (Workers Salaries) పెంపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వివాదంపై నిర్మాతల మండలి (Producers Councilor’s) సమావేశమై, కార్మికుల 30 శాతం వేతన పెంపు డిమాండ్‌ను తిప్పికొట్టింది. “చర్చల ద్వారానే పరిష్కారం వెతుక్కోవాలి” అనే అభిప్రాయాన్ని నిర్మాతలు వ్యక్తం చేశారు. వేతనాల అంశం లేబర్ కమిషన్  (Labor Commision) పరిధిలోకి వెళ్లడంతో, రెండు వర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు.

ఈరోజు (సోమవారం) సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు లేబర్ కమిషనర్‌ను నిర్మాత‌లు కలవనున్నారు. రెండు వర్గాల అభిప్రాయాలను పరిశీలించి, కమిషనర్ మధ్యవర్తిగా వ్యవహరించే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో, పరిశ్రమలో సమ్మె తాలూకు వాతావరణం నెలకొంటుందా? లేక సమస్య చర్చల ద్వారానే పరిష్కారమవుతుందా? అన్నది ఉత్కంఠను పెంచుతోంది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కంటే ఎక్కువా..?
ఇక ఫిల్మ్ ఛాంబర్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ (T.G. Vishwaprasad) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యాయి. “సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే, సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనం ఇస్తున్నాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సినీ కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ కష్టాలను, వాస్తవాలను చిన్నబుచ్చేలా ఉన్న ఈ వ్యాఖ్యలు బాధాకరమని కార్మికులు మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment