‘SSMB29′ కోసం ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్?

‘SSMB29' కోసం ప్రియాంక చోప్రా భారీ రెమ్యునరేషన్?

Summarize with AI

మహేశ్ బాబు(Mahesh Babu)-రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘SSMB29′ సినీ ప్రపంచంలో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, ఆమె రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

‘SSMB29′ కోసం ప్రియాంక ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, హాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం ఆమె రెమ్యునరేషన్ రూ.40 కోట్ల వరకు ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది.

క్లారిటీ ఇంకా రావాల్సిందే
ప్రియాంక రెమ్యునరేషన్ పై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, ఈ రూమర్లు ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ బాబు తొలిసారి నటిస్తుండడం, ప్రియాంక చోప్రా వంటి గ్లోబల్ స్టార్ ఇందులో భాగమవుతుండడంతో ‘SSMB29′ కు ప్రత్యేకమైన క్రేజ్ నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment