రీ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ ‘ఫ్యాషన్’

మళ్లీ తెరపైకి 'ఫ్యాషన్'

ప్ర‌ముఖ న‌టీమ‌ణులు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కంగనా రనౌత్(Kangana Ranaut) నటించిన ప్రఖ్యాత చిత్రం ఫ్యాషన్(Fashion) రీ-రిలీజ్‌కు సన్నాహాల మొద‌ల‌య్యాయి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వం వ‌హించ‌గా, రోనీ స్క్రూవాలా నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. 2008లో విడుదలైన ఈ సినిమాలో ప్రియాంక, కంగనా తన నటనతో ఉత్తమ నటి(National Awards) మరియు సహాయ నటిగా జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఈ సినిమాలో న‌ట‌న ప్రేక్షకుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. కాగా, మహిళా దినోత్సవాన్ని(Women’s Day) పుర‌స్క‌రించుకొని మార్చి 7న ఈ చలనచిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యాష‌న్ సినిమా రీ-రిలీజ్‌కు సంబంధించి ఏర్పాట్లు అన్నీ పూర్త‌యిన‌ట్లు బీ-టౌన్ కాంపౌండ్ చెబుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment